Welcome to Jai Reddy Community
Horizontal Marquee News ticker using Html & Css
ఉద్యమ లక్ష్యాలు ✊విద్యా – ఉద్యోగావకాశాలలో రిజర్వేషన్స్.
✊స్వయం ఉపాధి – సహకార రంగాలలో ప్రభుత్వ చేయూత.
✊ప్రత్యేక స్టడీ సర్కిళ్ళు గురుకులాలు.
✊పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపు.
✊అర్హత పరిక్షలలో కటాఫ్ మార్కుల – వయోపరిమితి సడలింపు.
✊రైతు సంక్షేమం – ఆరోగ్య పధకాల సమాన వర్తింపు.
✊60 సంవత్సరాలు నిండిన ప్రతీ రైతు బిడ్డకు అన్నదాత పేరుమీద నెలకు 5000 రూపాయల గౌరవ పింఛను.
✊పొలం బాటలో ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియా.

రాజ్యాంగం అందరిని సమానంగా చూడాలి..... అప్పడు అది ప్రజా రాజ్యాంగం అవుతుంది..

లేకపొతే వర్గరాజ్యాంగం అవుతుంది....

రెడ్డి అనేది ఒక సామాజిక బాధ్యత. ఒకనాడు రెడ్డి అనే కుటుంబానికి పెద్దగా ఉంటూ, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా వృత్తి చేసుకుంటూ, ఎన్నో కులాలను, మతాలను మరియు వర్గాలను ఒక గొడుగు కింద చేర్చి భిన్నత్వంలో ఏకత్వం చాటాడు.

అలాంటి మంచి మనిషికి ఈనాడు అతని ఉనికికే ప్రమాదం కలిగించాలని కుట్ర పన్నుతున్నారు. వివిధ రంగాలలో , వివిధ కోణాలలో అణచివేయబడుతున్నాడు. రెడ్డి అని పిలిస్తే రెడీ అనేవాడు రెడ్డి. ఒకనాటి చారిత్రక సామ్రాజ్యాలకు వారదిగా ,బ్రిటీష్ సామ్రాజ్యంలో ట్యాక్స్ కలెక్టర్ గా , నైజాం రాజ్యంలో పాలకుడిగా ఎన్నోరంగాలలో అలుపెరగని సేవను మన భారత దేశానికి అందించిన ఘనత మన రెడ్డి జాతిది.

రెడ్డి అనేవాడు కులగజ్జి లేనివాడు, సౌమ్యుడు. అలాంటివాడిని బజారుకు ఈడ్చి బంది చేసే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇది మన రెడ్డి కులానికి కాకుండా మనల్ని నమ్ముకున్న ఇతర కులాలకు, వర్గాలకు కూడా ముప్పు.

రాజ్యాంగం వివక్షతో మనము కోల్పోతున్న హక్కుల కోసం , సంక్షేమం కోసం చిత్తశుద్ది, పట్టుదల, నిరంతరం పోరాడటానికి విశిష్టమైన ఆలొచనలు, దృడసంకల్పం కలిగి మన లక్ష్యాన్ని సాధించటానికి ఒక వేదిక ఉండాలనే ఆలోచనకు కార్యరూపమే మన జై రెడ్డి

విద్యార్దులకు,యువతీ యువకులకు, రైతులకు సంక్షేమంలో అభివృద్ధి సాధించాలంటే వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి , మనము సంక్షేమ సంఘాల తో ఆ లక్ష్యాన్ని సాధించలేము , కావున ఆ నిధులను సాధించుకొనుటకు ఐక్యతతో పోరాడి, ప్రభుత్వం మెడలు వంచైనా సరే సాధించాలి.

అందువల్లనే, ఒక పటిష్టమైన వేదిక ఏర్పాటు కోసం విశాలమైన భావం తోనే, ప్రాంతాలకు , రాజకీయాలకు అతీతంగా ఉద్యమమే ద్యేయంగా, రెడ్డి రిజర్వేషన్స్ , రెడ్డి కార్పొరేషన్ , సంక్షేమం , హక్కుల సాధనే లక్ష్యం గా, ఎలాంటి స్వార్ధము , లాభాపేక్ష , సంకుచిత భావాలూ లేకుండా పూర్తిగా పార్గదర్శకంగా మన హక్కుల సాధనకోసం , విశ్వవ్యాప్తంగా రెడ్డి ఐక్యత కోసం ఏర్పాటు చేసిన వేదికే జై రెడ్డి. ప్రతీ అంశాన్ని, ప్రతీ రెడ్డి పరిస్థితిని, యువతీ, యువకుల సాధక బాధకాలను అధ్యయనం చేసి , విద్యావంతులు , ప్రముఖుల ఆలోచనల తో ఏర్పాటు చేసిన వేదిక జై రెడ్డి

అందరూ తన , మన, చిన్న , పెద్ద బేధాలు వదిలేసి విశ్వవ్యాప్తంగా ఒకే వేదికకి నాయకత్వం వహించడానికి ముందుకు కదలండి. సమిష్టి నాయకత్వం లో పోరాటం చేయడానికి విద్యార్దులు , యువతీ యువకులు , రైతులు సిద్ధంగా ఉన్నారు .

ఈ పోరాటం నీది, నాది కాదు మన అందరిది , మనం వేసే ఒక అడుగు ఎన్నో జీవితాలకు వెలుగునిస్తుంది. సోదరులారా... ఆలోచించండి... ఇది మన జీవితం... మన హక్కులు మనం సాధించుకుందాం...

సోదరులారా ఇది మన జీవితం.
మన తాత లు. .. తండ్రులు మౌనంగా భరించినందుకే మన జీవితం ఇలా తగలడింది.
మనమూ భరిస్తే రేపటి తరం అడుక్కోవడానికి కూడా అర్హత కోల్పోతారు.
మౌనం కాదు పోరాటం కావాలి.
సిద్ధాంతం కాదు ఉద్యమం కావాలి.
మన సమస్య కు పరిష్కారం పోరాటమే.

రండి పోరాడధాం మనకు రావలసిన రిజర్వేషన్స్ కోసం , హక్కుల కోసం , మనమే పోరాడి తెచ్చుకుందాం.

✊✊✊✊జై రెడ్డి ఉద్యమ లక్ష్యాలు:✊✊✊✊

✊ మాకు కావాలి - విద్యా - ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్స్.
✊ మాకు కావాలి - స్వయం ఉపాధి - సహకార రంగాలలో ప్రభుత్వ చేయూత.
✊ మాకు కావాలి - ఫ్రత్యేక గురుకులాలు - స్టడీ సర్కిళ్ళు.
✊ మాకు కావాలి - పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్ మెంట్ వర్తింపు.
✊ మాకు కావాలి - అర్హత పరీక్షలలో కటాఫ్ మార్కులు - వయో పరిమితి సడలింపు.
✊ మాకు కావాలి - రైతు సంక్షేమం - ఆరోగ్యపథకాల సమాన వర్తింపు
✊ మాకు కావాలి - ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పోరేషన్.
✊ మాకు కావాలి - 60 సంవత్సరాలు నిండిన ప్రతీ రైతు బిడ్డకు అన్నదాత పేరుమీద నెలకు 5000 రూపాయల గౌరవ పింఛను.
✊ మాకు కావాలి - పొలం బాటలో ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా
✊ మాకు కావాలి - ఉన్నత విదేశీ విద్య కోసం ప్రతి విద్యార్థికి 20 లక్షల విదేశీ విద్య నిధి